Red Fort | దేశ రాజధాని ఢిల్లీలో భారీ చోరీ జరిగింది. అత్యంత పటిష్ఠమైన భద్రత ఉండే చారిత్రక ఎర్రకోట (Red Fort) ప్రాంగణంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. జైన మతపరమైన ఆచారంలో భాగంగా ప్రదర్శనకు ఉంచిన దాదాపు కోటి రూపాయల విలువైన వజ్రాలు పొదిగిన కలశాన్ని ( jewelled urn) దొంగలు అపహరించుకుపోయారు (stolen).
ఎర్రకోటలో ప్రస్తుతం జైనుల ‘దశలక్షణ మహాపర్వం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో 760 గ్రాముల బంగారం, వజ్రాలు, పచ్చలు పొదిగిన ఆభరణాల కలశాన్ని ఉపయోగించారు. అయితే, ఈ కార్యక్రమాలకు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా (Om Birla) హాజరయ్యారు. నిర్వాహకులు ఓం బిర్లాకు స్వాగతం పలకడంలో బిజీగా ఉన్న సమయంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు.
అక్కడ వేదికపై ఉంచిన దాదాపు రూ.కోటి విలువైన కలశాన్ని అపహరించుకుపోయారు. కార్యక్రమం తిరిగి ప్రారంభమయ్యాక కలశం కనిపించకపోవడంతో నిర్వాహకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలో ఒక అనుమానిత వ్యక్తి కదలికలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే అతడిని అరెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే రెడ్‌ఫోర్ట్ ప్రాంతంలో భారీ చోరీ వ్యవహారం రాజధానిలో కలకలం రేపుతోంది.
Also Read..
PM Modi | యూఎస్ టారిఫ్స్ వేళ భారత్ కీలక నిర్ణయం.. ఐరాస సమావేశాలకు ప్రధాని మోదీ దూరం
Upendra Dwivedi | పాక్‌తో యుద్ధం మూడు రోజుల్లో ముగియలేదు : ఆర్మీ చీఫ్ జనరల్
Mumbai | స్నేహితుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకే ముంబైకి బాంబు బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్