బచ్చన్నపేట జోన్ 23 : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన పసుల తిరుపతి( 42) (వెంకటేశ్వర్లు) అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేత కోడూరు శివకుమార్ వెంటనే వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి అంత్యక్రియల గాను ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. చిన్న వయసులోనే తిరుపతి చనిపోవడం బాధాకరం అన్నారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కాగా, ఎవరికి ఎలాంటి ఆపద ఉన్న నేనున్నానంటూ ప్రతి కుటుంబాని ఆర్థిక సాయం అందిస్తున్న శివకుమార్ గౌడ్ ను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో నాగపురి బిక్షపతి, పిట్టల ఇస్తారి, తెలు శ్రీనివాస్, యాట రమేష్, కూరమ్ బాలయ్య, కురాము వెంకటేశం, చిలక నర్సయ్య, సోప్పరి సిద్దులు ముదిరాజ్, సంఘం నాయకులు పాల్గొన్నారు.