Harish Rao | జనగామ జిల్లా ఎర్రగుంట తండాలో జరిగిన లాఠీచార్జ్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. లాఠీలు విరిగేలా, రక్తాలు వచ్చేలా పోలీసులు విరుచుకుపడటం దారుణమని మండిపడ్డారు. మాజీ సర్పంచ్, 8 మంది వార్డు సభ్యులపై పోలీసులు నిరంకుశంగా దాడి చేయడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు.
ఇది ప్రజా పాలన కాదు, ప్రజాపీడనం అని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమై, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై అణచివేత రాజకీయాలు కొనసాగిస్తోందని మండిపడ్డారు. హామీలు అడిగితే లాఠీచార్జ్, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ఎంతకాలం పోలీస్ పహారాలతో ప్రభుత్వం నడపాలని చూస్తున్నారని నిలదీశారు. తక్షణమే అరెస్టు చేసిన ఎమ్మెల్యే, మాజీ సర్పంచ్, వార్డు సభ్యులను విడుదల చేయాలన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జనగామ జిల్లా, ఎర్రగుంట తండాలో జరిగిన లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను.
లాటిలు విరిగేలా, రత్తాలు వచ్చేలా పోలీసులు విరుచుకుపడటం దారుణం.మాజీ సర్పంచ్, 8 మంది వార్డు సభ్యులపై పోలీసులు నిరంకుశంగా దాడి చేయడం హేయమైన చర్య.
ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే @PRR_BRS గారిని అరెస్టు… pic.twitter.com/jEcIRzsHPc
— Harish Rao Thanneeru (@BRSHarish) January 26, 2025