Harish Rao | సికింద్రాబాద్ అస్తిత్వం కాపాడుకునేందుకు చేపట్టిన శాంతియుత ర్యాలీపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమే మా ఏడో గ్యారంటీ అని చెప్పిన రేంత్ రెడ్డి .. నేడు ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేస్తూ నిరంకుశత్వమే మా పాలసీ అని నిరూపిస్తున్నారని విమర్శించారు.
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం మా పార్టీ సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం, కార్యకర్తలను అరెస్టు చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని అడ్డుకోవద్దని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు.. మీ నిర్బంధాలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. చారిత్రక సికింద్రాబాద్ అస్తిత్వం కోసం మా పోరాటం ఆగదని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమే మా ఏడవ గ్యారంటీ అని చెప్పిన @revanth_anumula గారు.. నేడు ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేస్తూ నిరంకుశత్వమే మా పాలసీ అని నిరూపిస్తున్నారు.
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం మా పార్టీ సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్… pic.twitter.com/zt6f9DUTNr
— Harish Rao Thanneeru (@BRSHarish) January 17, 2026