BRS Leader Allavuddin | కొండాపూర్, డిసెంబర్ 13 : కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న అభయ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి బీఆర్ఎస్ నాయకుడు అల్లావుద్దీన్ రూ. 50 వేల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డివిజన్ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే పార్టీ లక్ష్యమన్నారు.
ఒక వర్గానికే కొమ్ము కాసే కొన్ని పార్టీలను భవిష్యత్తులో ప్రజలే తరిమికొడతారని, వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం, కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం పక్కా అన్నారు. మైనార్టీ నాయకుడు హిందూ ప్రజల ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ ముందుకు సాగడం సంతోషంగా ఉందంటూ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి, నాయకులు రవి యాదవ్, మల్లారెడ్డి, సంగారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బాలరాజ్, గౌస్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
Actor Pragathi | నా పూజల వలనే మెడల్స్ గెలిచింది.. నటి ప్రగతి పతకాలపై వేణు స్వామి కామెంట్స్
Akhanda 2 | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘అఖండ 2’.. బాలయ్య మాస్ తుపానుకి తొలి రోజు ఫుల్ కలెక్షన్స్
Lionel Messi | ఒకచోట ఇద్దరు దిగ్గజాలు.. మెస్సీని కలిసిన షారుఖ్ ఖాన్.. వీడియో