– మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి
మెదక్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పట్టణంలోని పలు వార్డులకు చెందిన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ లో చేరారు. వార్డు నెంబర్ 10 నుండి కాంగ్రెస్ నాయకులు చింతల శ్రీను, కిషన్, మంద శేఖర్ తో పాటు 20 మంది కార్యకర్తలు, మహిళలు, అలాగే వార్డు నెంబర్ 27 నుండి పల్లె రాణి బాలరాజ్ తోపాటు 20 మంది కార్యకర్తలు, వార్డు నెంబర్ 31 నుండి ఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వరాల రాములు, రణధీర్, కంచర్ల శ్రీధర్, యాదగిరి, నరేష్, మంగలి మహేష్, ఆకుల రాహుల్ పాటు 30 మంది కార్యకర్తలు పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వీరికి పద్మ దేవేందర్ రెడ్డి, మెదక్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లో చేరిన వారిని అభినందించి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు తప్పా ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు. రానున్న కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, మళ్లీ కేసిఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పార్టీలో యువకుల చేరికతో భవిష్యత్ రాజకీయాలకు శుభ పరిమాణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ ఆర్కే శ్రీనివాస్, నాయకులు లింగారెడ్డి, కండేల నర్సింహులు, కసాపురం మధు, శ్రీనివాస్ గౌడ్, కృష్ణ, కిరణ్, రవి భువన్, చంద్ పాషా పాల్గొన్నారు.

Medak : ‘మెదక్ బల్దియాపై ఎగిరేది బీఆర్ఎస్ జండానే’