హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చేప్టటిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమం లో అనేక లోపాలు దొర్లుతున్నాయని, వీటిని నివారించేందుకు గడువును వెంటనే పొడిగించాలని బీఆర్ఎస్ సర్ కో-ఆర్డినేషన్ కమిటీ డిమాండ్ చేసింది. బీఆర్కే భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డిని కమిటీ సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఓటర్ల సవరణ కోసం ఎన్నికల కమిషన్ కేటాయించిన సమయం ఏమాత్రం సరిపోదని, గడువును మరికొంత కాలం పొడిగించాలని సీఈవోను కోరినట్టు తెలిపారు.
‘ఈ విషయమై సీఈవో సుదర్శన్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మా పార్టీ తరఫున కూడా కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను స్వయం గా కలిసి పరిస్థితిని వివరించాం. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ మొత్తం ప్రక్రియ ఒక ప్రహసనంగా మారింది’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియపై సాంకేతిక పరంగా తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని, వాటిపై ఎన్నికల కమిషన్ ను కొన్ని ప్రశ్నలు అడిగినా ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని మండిపడ్డారు.
ఇప్పటికే అనేక పిటిషన్లు దాఖలయ్యాయని, వాటన్నింటినీ ఎన్నికల కమిషన్ వెంటనే పరిషరించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, కచ్చితంగా గడువును పొడిగించి, పెండింగ్‌లోని ఫిర్యాదులు, పిటిషన్లను తక్షణమే క్లియర్ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, పార్టీ నాయకులు సుమిత్రానంద్, సతీశ్‌రెడ్డి, అభిలాశ్ రంగినేని తదితరులు పాల్గొన్నారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సుదర్శన్‌రెడ్డిని కలిసి సర్‌పై వినతిపత్రం అందజేశారు.