‘సర్’ గడువు పొడిగించాలి
రాష్ట్రంలో చేప్టటిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమం లో అనేక లోపాలు దొర్లుతున్నాయని, వీటిని నివారించేందుకు గడువును వెంటనే పొడిగించాలని బీఆర్ఎస్ సర్ కో-ఆర్డినేషన్ కమిటీ డిమాండ్ చేసింది.
- క్షేత్రస్థాయిలో బీఎల్వోలు విఫలం
- టెక్నికల్‌గా కూడా కొన్ని అనుమానాలు
- ఓటర్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులపై
- సీఈవోకు బీఆర్ఎస్ సర్ కమిటీ ఫిర్యాదు
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చేప్టటిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమం లో అనేక లోపాలు దొర్లుతున్నాయని, వీటిని నివారించేందుకు గడువును వెంటనే పొడిగించాలని బీఆర్ఎస్ సర్ కో-ఆర్డినేషన్ కమిటీ డిమాండ్ చేసింది. బీఆర్కే భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డిని కమిటీ సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఓటర్ల సవరణ కోసం ఎన్నికల కమిషన్ కేటాయించిన సమయం ఏమాత్రం సరిపోదని, గడువును మరికొంత కాలం పొడిగించాలని సీఈవోను కోరినట్టు తెలిపారు.
‘ఈ విషయమై సీఈవో సుదర్శన్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మా పార్టీ తరఫున కూడా కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను స్వయం గా కలిసి పరిస్థితిని వివరించాం. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ మొత్తం ప్రక్రియ ఒక ప్రహసనంగా మారింది’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియపై సాంకేతిక పరంగా తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని, వాటిపై ఎన్నికల కమిషన్ ను కొన్ని ప్రశ్నలు అడిగినా ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని మండిపడ్డారు.
ఇప్పటికే అనేక పిటిషన్లు దాఖలయ్యాయని, వాటన్నింటినీ ఎన్నికల కమిషన్ వెంటనే పరిషరించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, కచ్చితంగా గడువును పొడిగించి, పెండింగ్‌లోని ఫిర్యాదులు, పిటిషన్లను తక్షణమే క్లియర్ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, పార్టీ నాయకులు సుమిత్రానంద్, సతీశ్‌రెడ్డి, అభిలాశ్ రంగినేని తదితరులు పాల్గొన్నారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సుదర్శన్‌రెడ్డిని కలిసి సర్‌పై వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BLOs
- BRS Committee
- ceo
- sir
RELATED ARTICLES
తాజా వార్తలు
Shiva Kandukuri | వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న టాలీవుడ్ నటుడు శివ కందుకూరి.!
BRS Dharna | కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ధర్నా.. నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్
Harish Rao | దమ్ముంటే నువ్వే సిద్దిపేటలో నా మీద పోటీ చెయ్.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
Negligence | ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో అధికారుల నిర్లక్ష్యం..సర్పంచును పక్కనపెట్టి ప్రారంభోత్సవం
సాగర్ నీటి వనరుల పరిరక్షణ, ప్రాజెక్టు భద్రతపై రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

