రేవంత్‌ది నరహంతక భాష
నరహంతకుడు, ఉగ్రవాది, టెర్రరిస్టు తరహా భాష మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని గాంధేయవాదులమని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ తక్షణమే సీఎం పదవి నుంచి తొలగించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ డిమాండ్ చేశారు.
- కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను సీఎం పదవి నుంచి తప్పించాలి
- రిటైర్డ్ ఇంజనీర్లపై మాట్లాడటం సిగ్గుచేటు: బొల్లం మల్లయ్యయాదవ్
- రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: సుమిత్రానంద్
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): నరహంతకుడు, ఉగ్రవాది, టెర్రరిస్టు తరహా భాష మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని గాంధేయవాదులమని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ తక్షణమే సీఎం పదవి నుంచి తొలగించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి భాషతీరు ఉగ్రవాది కంటే దారుణంగా ఉన్నదని, ప్రభుత్వ వ్యతిరేక వార్తల విషయంలో జర్నలిస్టులను, ఫీజు రీయింబర్స్మెంట్ అంశంలో యాజమాన్యాలను, కాళేశ్వరం విషయంలో రిటైర్డ్ ఇంజినీర్లను భయభ్రాంతులకు, బ్లాక్‌మెయిల్‌కు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్లో టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
మహిళలకు రక్షణ లేదు: సుమిత్రానంద్
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ ఆందోళన వ్యక్తంచేశారు. మహిళా కమిషన్ సభ్యురాలు శంకరమ్మ మహిళల సమస్యలపై కాకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారని, రాజకీయాలు పకనబెట్టి అమరుల కుటుంబాల పక్షాన నిలబడి సీఎంను నిలదీయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

