మా పొట్టగొట్టి నీళ్లు ఎట్ల తీసుకెళ్తరు?
‘మా నీళ్లు మాకు కావాలి.. మా పొట్టగొట్టి ఎట్ల తీసుకెళ్తరు?’ అంటూ రైతులు ఆందోళనకు దిగారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని దేవాదుల ఎత్తిపోతల పథ కం చలివాగు పంప్‌హౌస్ వద్ద మంగళవారం నిరసన చేపట్టారు.
- దేవాదుల వద్ద రైతుల ఆందోళన
- గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు
- అధికారులతో అన్నదాతల వాగ్వాదం
- ఈఈ ఆదేశాలతో మోటర్ బంద్
- ధర్మసాగర్‌కు జలాల నిలిపివేత
శాయంపేట, జూలై 14 : ‘మా నీళ్లు మాకు కావాలి.. మా పొట్టగొట్టి ఎట్ల తీసుకెళ్తరు?’ అంటూ రైతులు ఆందోళనకు దిగారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని దేవాదుల ఎత్తిపోతల పథ కం చలివాగు పంప్‌హౌస్ వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. చలివాగు నుంచి గోదావరి జలాలను ధర్మసాగర్‌కు తరలించొద్దని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 16 ఫీట్లు చలివాగులో నీళ్లు ఉంచిన తర్వాతే మిగతా నీటిని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
రైతులను పంప్‌హౌస్ గేటు వద్దే పోలీసులు, అధికారులు నిలిపివేశారు. దీంతో వాగ్వాదం జరిగి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు లోపలి నుంచి దేవాదుల డీఈ గణేశ్‌ను బయటకు తీకొచ్చి మాట్లాడించారు. ధర్మసాగర్‌కు నీటి పంపింగ్‌ను నిలిపివేయాలని రైతులు కోరగా, మోటర్లు బంద్ చేయడం కుదరదని డీఈ బదులివ్వడంతో గేటు వద్దే బైఠాయించారు.
దేవాదుల ఎత్తిపోతల పథకం కోసం ఇక్కడి రైతులం భూములు ఇచ్చామని, రెండు పంటలు పండుతాయని ఆశించామని, కానీ ఇకడి పంటలు ఎండబెట్టి ధర్మసాగర్‌కు నీటిని తీసుకెళ్లడం తగదని అన్నారు. ‘మా పొట్టగొట్టి అక్కడి రైతుల కడుపు నింపుతారా?’ అని నిలదీశారు. ఈ క్రమంలో డీఈ గణేశ్ దేవాదుల ఈఈ సునీతతో ఫోన్లో మాట్లాడించారు.
ఇప్పుడు మోటర్లు బందు చేస్తే ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రి నుంచి ఇబ్బందులు వస్తాయని, 4 రోజుల తర్వాత మోటర్లు ఆపేస్తామని చెప్పడంతో రైతులు మండిపడ్డారు. తామే లోపలికి వెళ్లి మోటర్లు బంద్ చేసుకుంటామని ఆందోళన చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం దేవాదుల ఈఈ సునీత 24 గంటలపాటు చలివాగు పంప్‌హౌస్ నుంచి ధర్మసాగర్‌కు పంపింగ్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ధర్మసాగర్‌కు ఎత్తిపోస్తున్న మోటర్‌ను అధికారులు బంద్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

