‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
గ్రామంలోని కోతులు, కుక్కల బెడదను నివారించే వరకు గ్రామ సభలకు హాజరు కాబోమని గౌతమ్పూర్ 8 ఇంక్లైన్ కాలనీకి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు స్పష్టం చేశారు. బుధవారం గ్రామ సభను నిర్వహించేందుకు సెక్రటరీ షర్మిల, సర్పంచ్ కళ్యాణి...
– గౌతమ్పూర్ 8 ఇంక్లైన్ కాలనీలో వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తుల నిరసన
చుంచుపల్లి, అక్టోబర్ 14 : గ్రామంలోని కోతులు, కుక్కల బెడదను నివారించే వరకు గ్రామ సభలకు హాజరు కాబోమని గౌతమ్పూర్ 8 ఇంక్లైన్ కాలనీకి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు స్పష్టం చేశారు. బుధవారం గ్రామ సభను నిర్వహించేందుకు సెక్రటరీ షర్మిల, సర్పంచ్ కళ్యాణి ముందు రోజు చాటింపు చేశారు. బుధవారం గ్రామ సభ నిర్వహించేందుకు పంచాయతీ కార్యాలయం ముందు కుర్చీలు వేసి గ్రామ ప్రజల కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. కానీ ఎవరు కూడా గ్రామ సభకు హాజరు కాలేదు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ నిర్వహించిన సాధారణ గ్రామ సభను బహిష్కరించారు.
సమస్యలు పరిష్కరించని గ్రామ సభలు ఎందుకు?
గ్రామంలో కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉందని, వాటి దాడులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు గ్రామసభల్లో ఈ సమస్యలను ప్రస్తావించినప్పటికీ పరిష్కారం లభించలేదని పేర్కొంటున్నారు. గ్రామంలో కోతులు, కుక్కలను పట్టించేందుకు గతంలో చర్చలు జరగడంతో పాటు, డీపీఓ సైతం సమస్య పరిష్కారానికి ఆదేశించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శిస్తున్నారు. మరోవైపు గ్రామానికి కోటి రూపాయల నిధులు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రాథమిక సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిధుల గురించి ప్రచారం చేయడం కంటే ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని, గ్రామసభలను మొక్కుబడిగా నిర్వహించి అసలు సమస్యలను పక్కదారి పట్టించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

