Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Rashmika | నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ నటి.. ఇప్పుడు ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆహార సాయం అందించేందుకు ముందుకొచ్చారు. పేద కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ అనే సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Rashmika | నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ నటి.. ఇప్పుడు ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆహార సాయం అందించేందుకు ముందుకొచ్చారు. పేద కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ అనే సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా దక్షిణ భారతదేశంలోని ఎనిమిది ప్రాంతాల్లో మొత్తం 400 కుటుంబాలకు నిత్యావసర ఆహార పదార్థాలను అందిస్తున్నారు. రష్మిక చేపట్టిన ఈ ప్రయత్నంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’లో భాగంగా అవసరంలో ఉన్న కుటుంబాలకు ఆహార పదార్థాలతో కూడిన కిట్లను అందిస్తున్నారు. ఒక్కో కిట్‌లో 75 కిలోల బియ్యం, 10 కిలోల గోధుమ పిండి, 15 కిలోల వివిధ రకాల పప్పులు, 10 లీటర్ల వంట నూనెతో పాటు రాగులు, మసాలా దినుసులు, టీ వంటి ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి.
కుటుంబాలకు కొంతకాలం పాటు ఆహార అవసరాల విషయంలో తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. రోజువారీ అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఇలాంటి సాయం ఉపయోగపడుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, అనంతపురం, బెంగళూరు, కొచ్చి, చెన్నై, కొడగు, విజయవాడ ప్రాంతాల్లోని కుటుంబాలకు ఈ ఆహార కిట్లను అందిస్తున్నారు.తనకు లభిస్తున్న ప్రేమాభిమానాలకు సమాజానికి ఉపయోగపడే పనుల ద్వారా స్పందించాలని రష్మిక భావిస్తున్నట్లు ఆమె వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. సినిమాల ద్వారా సంపాదించిన గుర్తింపును సామాజిక సేవకు కూడా ఉపయోగించడం పట్ల పలువురు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమం వెనుక ఉన్న ఆలోచనను వివరిస్తూ రష్మిక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన ‘రణబాలి’ సినిమాలోని జయమ్మ పాత్రకు, తన నిజ జీవితానికి ఏమైనా పోలికలు ఉన్నాయా అని చాలామంది అడుగుతున్నారని ఆమె తెలిపారు. దానికి నా సమాధానం అవును. ఈ కార్యక్రమం కూడా అలాంటి పోలికల్లో ఒకటి. నేను ఎప్పటి నుంచో ఇలాగే ఉంటున్నాను. జయమ్మ పాత్ర కూడా ఇలాగే ఉంటుంది. మీరు నాకు ఇస్తున్న ప్రేమకు ప్రతిగా ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాను” అని రష్మిక పేర్కొన్నారు. మరోవైపు రష్మిక నటించిన ‘రణబాలి’ సినిమా విడుదలకు సిద్ధమైంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో రష్మిక కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

