Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
Navaratri Brahmotsavams | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ వాహనం పై యోగ నరసింహస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (Navaratri Brahmotsavams) మూడో రోజైన బుధవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ వాహనం ( Simha Vahanam ) పై యోగ నరసింహస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సింహ వాహనంపై కొలువుదీరిన స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు గోవింద నామస్మరణలతో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.


సింహం ధైర్యం, పరాక్రమం, తేజస్సు, గంభీరతలకు ప్రతీక. దుష్టశిక్షణ, శిష్టరక్షణ సంకల్పాన్ని చాటుతూ మలయప్పస్వామివారు సింహ వాహనాన్ని అధిరోహించారు. యోగ నరసింహస్వామి అలంకారంలో స్వామివారి దివ్యదర్శనం భక్తులకు నిర్భయత్వం, ఆత్మవిశ్వాసం, ధర్మమార్గంలో నడిచే స్ఫూర్తిని అందించింది.


ఈ వాహనసేవ చాటిచెప్పింది.ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, జానకిదేవి, రంగశ్రీ, శాంత రామ్, సీవీఎస్వో కే.వి. మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

