BGT 2024-25 : క్రికెట్ గొప్ప సమరాల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఒకటి. యాషెస్ సిరీస్ మాదిరిగానే హోరాహోరీ పోరాటాలకు పెట్టింది పేరైన ఈ ట్రోఫీ మళ్లీ అభిమానులను అలరించనుంది. ఇరుదేశాల దిగ్గజాల పేర్లతో నిర్వహిస్తున్న ఈ ట్రోఫీపై ఈసారి భారీగా అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ గడువు సమీపిస్తోంది.
ప్రస్తుతం ఒకటి, రెండు స్థానాల్లో ఉన్న ఆసీస్, భారత్‌లకు ఈ ట్రోఫీ కీలకం కానుంది. మరో వారం రోజుల్లో ఆస్ట్రేలియా, టీమిండియాలు పెర్త్ టెస్టు వేదికగా తలపడనున్నాయి. ఇంతకూ ఈ టోర్నీ ఎప్పుడు, ఎలా మొదలైంది? అనేది తెలుసా..?
Look at The last 8 Border-Gavaskar Trophies winners 🏆
Can India win once again BGT ? 👀 pic.twitter.com/9SZtcJ2pgD
— IPLnCricket: Everything about Cricket (@IPLnCricket) November 6, 2024
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1996లో మొదలైంది. ఆ ఏడాది ఏకైక టెస్టు కోసం భారత పర్యటనకు వచ్చింది ఆస్ట్రేలియా జట్టు. అప్పుడే ఇటు భారత ఓపెనర్ సునీల్ గవాస్కర్, అటు ఆసీస్ ఆటగాడు అలెన్ బోర్డర్ పేర్లతో ఒక సిరీస్ జరిపితే బాగుండు అని ఇరుదేశాల బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి. ఆలస్యం చేయడం ఎందుకని ఆ ఏకైక టెస్టుకు బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీగా నామకరణం చేశారు. అలా మొదలైన ఈ ట్రోఫీ ప్రతిసారి ఉత్కంఠ రేపుతూనే ఉంది.
Don’t break the streak.#BGT2024 #INDvAUS pic.twitter.com/VCp9Q9vIA7
— Champak Bora (চম্পক বৰা) (@champaliveee) November 12, 2024
స్వదేశంలో భారత్, ఆసీస్‌లు పైచేయి సాధిస్తూ వస్తున్నాయి. భారత గడ్డపై 29 మ్యాచ్‌లు జరగగా.. ఇండియా ఆధిపత్యం చెలాయిస్తూ 18 విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా మాత్రం 6 పర్యాయాలు గెలుపొందగా.. 5 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇక కంగారూల దేశంలో ఇరుజట్లు 27 మ్యాచ్‌లు ఆడాయి.
అలెన్ బోర్డర్, సునీల్ గవాస్కర్
స్వదేశంలో తమకు తిరుగులేదని చాటుతూ ఆసీస్ 14 సార్లు గెలుపొందగా.. భారత జట్టు ఆరు విజయాలు సాధించింది. 7 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇప్పటివరకూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 16 సార్లు నిర్వహించారు. టీమిండియా అత్యధికంగా 10 పర్యాయాలు ట్రోఫీని తన్నుకుపోగా.. ఆసీస్ కేవలం ఆరు సీజన్లలో విజేతగా అవతరించింది.
Excitement awaits! 🤩
Here’s your guide to every match in the Border-Gavaskar Trophy 2024–25 🏏🇦🇺🇮🇳#Cricket #BGT #AUSvIND #Rohit #Cummins #Kohli pic.twitter.com/bV4nlJ7BO2
— Sportskeeda (@Sportskeeda) November 13, 2024
ఆస్ట్రేలియా గడ్డపై గతంలో తడబడే భారత జట్టు 2017 నుంచి కొత్త చరిత్రను సృష్టించింది. కంగారూ జట్టుకు షాకిస్తూ ట్రోఫీని కైవసం చేసుకుంది. అనంతరం 2021లోనూ ఆసీస్‌ను చిత్తుగా ఓడించి టీమిండియా ట్రోఫీ కొల్లగొట్టింది. అదే ఊపులో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు పట్టుదలతో ఉంది.