న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ప్రధాని మోదీ ఇటీవల లక్నో సభలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు సమోసాల కోసం గొడవ పడటం చర్చనీయాంశమైంది. సభకు వచ్చిన వారికి పంచిన సమోసాలు అందరికీ అందకపోవటం బీజేపీ కార్యకర్తల్ని ఆగ్రహానికి గురిచేసింది.
ఒకవైపు మోదీ ప్రసంగిస్తుండగా, సమోసాల కోసం కొందరు బీజేపీ నేతలుతన్నుకున్నారు. పూల కుండీలు మాయం& లక్నోలో రాష్ట్రీయ ప్రేరణ స్థల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పూల కుండీలు ప్రధాని మోదీ పర్యటన ముగిసిన వెంటనే చోరీ అయ్యాయి. కటౌట్లను కూడా తొలగించి పట్టుకుపోయారు.