పంజాబ్‌లో బీజేపీ ఎమ్మెల్యేపై రైతుల దాడి

మాలోట్ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారు. కేంద్ర చట్టాలను సమర్ధిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఓ బీజేపీ ఎమ్మెల్యేపై దాడి చేసిన రైతులు, ఆయన చొక్కాను చించేశారు. పోలీసుల రక్షణలో ఆయన బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
శనివారం పంజాబ్‌లోని ముక్త్సర్ జిల్లాలోని మాలోట్‌లో బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్‌ను రైతులు కొట్టారు. ఈ సంఘటనలో అతడి బట్టలు చినిగిపోయాయి. అతనికి కూడా చాలా గాయాలయ్యాయి. అరుణ్ నారంగ్ అబోహర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే. బీజేపీ కార్యాలయంలో శనివారం వ్యవసాయ చట్టాలకు మద్దతుగా మీడియా సమావేశం నిర్వహించడానికి మాలోట్ వచ్చారు. ఆయన రాక గురించి తెలుసుకున్న రైతులు.. మాలోట్లోని బీజేపీ కార్యాలయాన్నిముట్టడించారు. పెద్ద సంఖ్యలో రైతులు అక్కడ గుమిగూడారు. రైతులు పెద్ద సంఖ్యలో వస్తుండటాన్ని గమనించిన పోలీసులు.. ఎమ్మెల్యేను బయటకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రైతులు వారిని అనుసరించాగా పోలీసులు ఎమ్మెల్యేని ఒక దుకాణం లోపలికి తీసుకువెళ్లారు.
రైతులు దుకాణం వెలుపల ధర్నాకు దిగారు. పోలీసులు దుకాణాన్ని మూసివేశారు. దాంతో రైతులు ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశారు.పోలీసులు నారంగ్‌ను దుకాణం నుంచి సురక్షితంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. రైతులు వారి వెంట పరుగెత్తారు. కోపంతో ఉన్న రైతులను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. రెండు వైపుల నుంచి ఘర్షణలు మొదలయ్యాయి. ఇంతలో రైతులు ఎమ్మెల్యేను పట్టుకుని కొట్టారు. బట్టలూడదీశారు. ఎమ్మెల్యే నారంగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఎమ్మెల్యేను రక్షించి మరోచోటికి తరలించారు. రైతులు బీజేపీ కార్యాలయంపై దాడికి దిగి నిప్పంటించారు.
గత నవంబర్ నెలలో కూడా అరుణ్ నారంగ్‌ను రైతులు ముట్టడించి కదలకుండా చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. గత రెండు రోజులుగా రైతులు బీజేపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఇతర సీనియర్ నేతలను ఘెరావ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
గోవాకు రండి.. యూనిఫాం సివిల్ కోడ్ ఎలా పనిచేస్తుందో చూడండి : సీజేఐ బొబ్డే
క్రిప్టో కరెన్సీపై నిషేధం వద్దు : కేంద్రానికి ఇద్దరు పారిశ్రామికవేత్తల వినతి
కూరలో విలువైన ముత్యం.. థాయ్ పేదింటి మహిళకు అదృష్టం
సవతి కూతురుపై ఐదేండ్లుగా లైంగికదాడి.. సర్దానాలో షాకింగ్ న్యూస్
చట్టసభల్లో నిర్మాణాత్మక, ప్రయోజనాత్మక చర్చలు జరగాలి : వెంకయ్య
అత్యంత ఘోర విమాన ప్రమాదం.. 583 మంది దుర్మరణం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

