గోవాకు రండి.. యూనిఫాం సివిల్ కోడ్ ఎలా పనిచేస్తుందో చూడండి : సీజేఐ బొబ్డే
న్యూఢిల్లీ : మేధావులు గోవాకు వచ్చి యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) ఎలా పనిచేస్తుందో చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే పిలుపునిచ్చారు.

న్యూఢిల్లీ : మేధావులు గోవాకు వచ్చి యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) ఎలా పనిచేస్తుందో చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే పిలుపునిచ్చారు. ఏకరీతి పౌరస్మృతిపై చర్చను మరోసారి ప్రారంభించే రీతిలో సీజే వ్యాఖ్యలు చేశారు. ‘రాజ్యాంగం రూపొందించినవారు భారతదేశానికి సంబంధించిన కోడ్‌ను ఊహించారు. దేశంలోని మేధావులు గోవాను సందర్శించి ఏకరీతి పౌరస్మృతి ఎలా పనిచేస్తుందో చూడాలి’ అని సీజేఐ బొబ్డే శనివారం సూచించారు.
గోవాలోని బొంబాయి హైకోర్టు కొత్త భవనాన్ని ప్రారంభిస్తూ ఈ వివాదాస్పద అంశంపై బొబ్డే మరోసారి చర్చను లేవనెత్తారు. ‘భారతదేశం కోసం రాజ్యాంగం రూపకర్తలు తీసుకొచ్చిన కోడ్లన్నింటిని గోవా కలిగి ఉన్నది. ఆ కోడ్ క్రింద విచారణ నిర్వహించే అధికారాన్ని సీజేఐగా నేను కలిగి ఉన్నాను. ఇది మతపరమైన అనుబంధంతో సంబంధం లేకుండా అందరు గోవా ప్రజలకు వివాహం, వారసత్వంగా వర్తిస్తుంది. నేను యూనిఫాం సివిల్ కోడ్ గురించి చాలా విద్యా చర్చలు విన్నాను. మేధావులందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ అందిస్తున్న న్యాయ పరిపాలనను చూడాలని నేను కోరుతున్నాను. అప్పుడే అదేమిటో మీకందరికీ తెలుస్తుంది’ అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో సీజేఐ చెప్పారు.
భారతదేశంలో యూసీసీ ఉన్న ఏకైక రాష్ట్రం గోవా. తద్వారా ఇక్కడి వారి మతంతో సంబంధం లేకుండా పౌరులందరినీ పరిపాలించే ఏకరీతి వ్యక్తిగత చట్టాలు ఇక్కడ అమలులో ఉన్నాయి. భారతదేశ భూభాగం అంతటా ఏకరీతి పౌరస్మృతి.. పౌరులందరికీ భద్రత కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 వెల్లడిస్తున్నది.
యూసీసీ తీసుకొస్తామని 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీగా పేర్కొన్నది. ఏకరీతి పౌరస్మృతిని అమలుచేయాలంటూ బీజేపీ సీనియర్ నాయకుడు, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వివిధ అంశాలపై దాఖలైన పిల్స్‌ను సుప్రీంకోర్టు విడివిడిగా విచారిస్తున్నది. సీజేఐ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. రెండేండ్ల కాల వ్యవధిలో యూసీసీ అమలుపై కేంద్రం వైఖరిని తెలుపాలంటూ సుప్రీంకోర్టు రెండు సార్లు నోటీసులు పంపింది.
ఇవి కూడా చదవండి
క్రిప్టో కరెన్సీపై నిషేధం వద్దు : కేంద్రానికి ఇద్దరు పారిశ్రామికవేత్తల వినతి
కూరలో విలువైన ముత్యం.. థాయ్ పేదింటి మహిళకు అదృష్టం
సవతి కూతురుపై ఐదేండ్లుగా లైంగికదాడి.. సర్దానాలో షాకింగ్ న్యూస్
చట్టసభల్లో నిర్మాణాత్మక, ప్రయోజనాత్మక చర్చలు జరగాలి : వెంకయ్య
అత్యంత ఘోర విమాన ప్రమాదం.. 583 మంది దుర్మరణం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి
డీలర్ షాపు కేటాయింపులో డబ్బుల వసూళ్లు.. అలంపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అక్రమాలపై చర్చ!
Ramayana | 8 రోజుల్లోనే రూ.1,033 కోట్లు.. ‘రామాయణం’ బాక్సాఫీస్ విధ్వంసం, అయినా ఆ రెండు సినిమాల తర్వాతే!
IND vs NZ | సెంచరీతో చెలరేగిన విల్ యంగ్.. భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్
Rajasthan: రాజస్థాన్‌లో 3 రకాల ఓటర్ల జాబితాలు.. సర్‌తో పోలిస్తే ఎస్‌ఎస్‌ఆర్‌లో 11 లక్షల మంది అధిక ఓటర్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

