చట్టసభల్లో నిర్మాణాత్మక, ప్రయోజనాత్మక చర్చలు జరగాలి : వెంకయ్య
హైదరాబాద్ :చట్టసభలు నిర్మాణాత్మక, ప్రయోజనాత్మక చర్చలకు వేదికలు కావాలే తప్ప, అంతరాయాలకు కాదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తెలిపారు.

హైదరాబాద్ :చట్టసభలు నిర్మాణాత్మక, ప్రయోజనాత్మక చర్చలకు వేదికలు కావాలే తప్ప, అంతరాయాలకు కాదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రముఖ విద్యావేత్త, పత్రికా సంపాదకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి నూకల నరోత్తమ్ రెడ్డి శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ సమావేశ మందిరంలో వెంకయ్యనాయుడు శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా శతజయంతి కమిటీ సభ్యులను అభినందించిన ఆయన, ఇలాంటి మహనీయుల జీవితం గురించి, సమాజానికి వారు చూపిన బాట గురించి ముందు తరాలకు తెలుసుకోవాలని, అందుకోసం ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పారు.
చిన్నతనం నుంచే మంచి ప్రతిభ కనపరచిని నరోత్తమ్‌రెడ్డి సమాజసేవ మీద దృష్టి సారించి, రాజకీయాల్లోకి వచ్చారన్నారు. నిజాం వ్యతిరేక పోరాటం మొదలుకుని ప్రజలను చైతన్య పరిచే అనేక ఉద్యమాల్లో వారు కీలక పాత్ర పోషించారని చెప్పారు. సురవరం ప్రతాపరెడ్డి ప్రారంభించిన గోలకొండ పత్రికకు సంపాదకులుగా ఆ పత్రికకు ప్రజాభిమాన్ని సంపాదించిపెట్టడంలో కీలక పాత్ర పోషించారన్న వెంకయ్యనాయుడు.. సురవరం నెలకొల్పిన విలువలు, ప్రామాణికత ఏ మాత్రం తగ్గకుండా పత్రికను ముందుకు తీసుకుపోయారని తెలిపారు.
రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యులుగా సేవలందించిన నరోత్తమ్‌రెడ్డి అనేక కీలక చర్చల్లో ప్రజా గళాన్ని వినిపించారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఆయన స్ఫూర్తిని ఈ తరం రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. విద్యారంగం పట్ల నూకల నరోత్తమ్‌రెడ్డి అమిత శ్రద్ధను కనబరిచారని, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రెండు దశాబ్ధాలు సిండికేట్ సభ్యుడిగా, మూడేండ్ల పాటు ఉపకులపతిగా సేవలు అందించి విశ్వవిద్యాలయ ప్రమాణాలు పెంచేందుకు కృషి చేశారని తెలిపారు.
56 ఏళ్ళ క్రితం రాజ్యసభలో నరోత్తమ్‌రెడ్డి ప్రసంగాలను వింటే.. దేశంలో విద్యాప్రమాణాలను పెంచేందుకు ఆయన పడిన తపన మనకు అవగతమౌతుందన్నారు. ఆనాటి నాయకులు పాటించిన ప్రమాణాలు, వారు అనుసరించిన విలువలు, నీతి-నిజాయితీకి కట్టుబడి సామాజిక అభ్యున్నతే ధ్యేయంగా వారు చేసిన కృషి చిరస్మరణీయమైనదన్న ఆయన, ఇలాంటి నాయకుల జీవితాలను యువత అధ్యయనం చేయాలని, వారు జీవితాంతం పాటించిన విలువలు, దేశభక్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా నూకల నరోత్తమ్‌రెడ్డి గారి శతజయంతి సంచికను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమ్మూద్ అలీ, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య శివారెడ్డి, శతజయంతి కమిటీ కన్వీనర్ నూకల రాజేంద్రరెడ్డి సహా నూకల నరోత్తమ్‌రెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

