సవతి కూతురుపై ఐదేండ్లుగా లైంగికదాడి.. సర్దానాలో షాకింగ్ న్యూస్
సర్దానా : ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాకు చెందిన ఒక సవతి తండ్రి ఐదేండ్లపాటు తన కుమార్తెపై పదేపదే లైంగికదాడికి పాల్పడిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.

సర్దానా : ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాకు చెందిన ఒక సవతి తండ్రి ఐదేండ్లపాటు తన కుమార్తెపై పదేపదే లైంగికదాడికి పాల్పడిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సర్ధనా తహసీల్ పరిధిలోని కలాండ్ గ్రామంలో జరిగింది.
నిందితుడు తనపై 5 సంవత్సరాలుగా లైంగికదాడి చేస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేయడంతో నిందితుడు పరారయ్యాడు.
కలాండ్కు చెందిన ఒక మహిళ ముజఫర్ నగర్‌కు చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. కొన్నిరోజుల తరువాత భర్త నుంచి విడాకులు తీసుకుని కుమార్తెతో వేరుగా ఉంటున్నది. కాగా, కలాండ్ గ్రామానికి చెందిన మరో వ్యక్తిని వివాహం చేసుకున్నది. సవతి కూతురుతో అసభ్యంగా మాట్లాడుతూ వెకిలి వేషాలు వేసేవాడు. కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఎవరికైనా వెల్లడిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు ఆమెను బెదిరించాడు.
ఇలా ఐదేండ్లపాటు బాలికపై లైంగికదాడి జరుపుతూ వచ్చాడు. చివరకు ధైర్యం చేసుకున్న సదరు బాధితురాలు వారం క్రితం చైల్డ్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి తనకు జరిగిన అనుభవాన్ని వెల్లడించింది. మరుసటి రోజు, చైల్డ్‌లైన్ అధికారులు బాధితురాలు నివాసానికి చేరుకుని మొదట బాలికతో ఈ సంఘటన గురించి మాట్లాడారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలికను కూడా ప్రశ్నించి.. తరువాత ఆమెను వైద్య పరీక్ష కోసం పంపారు.
బాలికపై గత ఐదేండ్లుగా లైంగికదాడి జరిపిన వ్యక్తిపై చైల్డ్ లైన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడు. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద బాలికను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు సదరు బాలికను షెల్టర్ హోంకు పంపించారు.
ఇవి కూడా చదవండి
చట్టసభల్లో నిర్మాణాత్మక, ప్రయోజనాత్మక చర్చలు జరగాలి : వెంకయ్య
అత్యంత ఘోర విమాన ప్రమాదం.. 583 మంది దుర్మరణం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Crime
- rape case
- Utter Pradesh
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

