Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Rajinikanth | సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ.600 కోట్ల వసూళ్ల మార్కును దాటినట్లు ట్రేడ్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా ‘జైలర్ 2’ నిలిచే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
Rajinikanth | సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ.600 కోట్ల వసూళ్ల మార్కును దాటినట్లు ట్రేడ్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా ‘జైలర్ 2’ నిలిచే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే ఇంతటి భారీ విజయాన్ని అందుకుంటున్నప్పటికీ, నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బాక్సాఫీస్ వసూళ్లపై తరచుగా అధికారిక ప్రకటనలు చేయకపోవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
సాధారణంగా భారీ చిత్రాలు విడుదలైన తర్వాత నిర్మాతలు రోజువారీ వసూళ్ల వివరాలను పోస్టర్ల రూపంలో ప్రకటిస్తుంటారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల విషయంలో ఈ ప్రచారం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ‘జైలర్ 2’ విషయంలో సన్ పిక్చర్స్ మాత్రం వసూళ్ల వివరాలను ఎందుకు వెల్లడించడం లేదు. సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత నిర్మాణ సంస్థ కలెక్షన్ల పోస్టర్‌ను విడుదల చేసింది. అప్పటివరకు ఎలాంటి వివరాలు ప్రకటించకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. సినిమా భారీ వసూళ్లు సాధిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నప్పటికీ, అధికారికంగా లెక్కలు ప్రకటించకపోవడానికి కారణమేంటన్న ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ అంశంపై ఇటీవల రజనీకాంత్ పీఆర్ రియాజ్‌ను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ, రజనీకాంత్ బాక్సాఫీస్ వసూళ్ల కంటే సినిమా వల్ల సంబంధిత వర్గాలన్నీ సంతోషంగా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తారని వివరించారు. ‘తలైవర్ సినిమాకు సంబంధించిన అధికారిక వసూళ్ల వివరాలను వెంటనే ఎందుకు ప్రకటించడం లేదని చాలామంది అడిగారు. నటీనటులు, నిర్మాతలు, పంపిణీదారులు, ప్రేక్షకులు సంతోషంగా ఉండేలా చూడటమే తలైవర్ లక్ష్యం. ఆయన బాక్సాఫీస్ లెక్కల విషయంలో జోక్యం చేసుకోరు. వసూళ్లను పెంచి చూపించడాన్ని ఆయన ఇష్టపడరు. అలాగే నిర్మాతలను కలెక్షన్ల వివరాలు ప్రకటించమని కూడా ఒత్తిడి చేయరు అని రియాజ్ వెల్లడించారు. రజనీకాంత్ వ్యవహారశైలిపై రియాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

