Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Gangsters: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హిమాన్షు భాహూ , నీరజ్ ఫర్దిపురియాలను అమెరికాలో అరెస్టు చేశారు. మర్డర్లు, వ్యవస్థీకృత నేరాల్లో ఆ ఇద్దరిపై అనేక కేసులు ఉన్నాయి. అక్టోబర్ 22వ తేదీన లాస్ వెగాస్‌లో ఇద్దర్నీ ఒకే దగ్గర అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు(Gangsters) హిమాన్షు భాహూ , నీరజ్ ఫర్దిపురియాలను అమెరికాలో అరెస్టు చేశారు. మర్డర్లు, వ్యవస్థీకృత నేరాల్లో ఆ ఇద్దరిపై అనేక కేసులు ఉన్నాయి. అక్టోబర్ 22వ తేదీన లాస్ వెగాస్‌లో ఇద్దర్నీ ఒకే దగ్గర అదుపులోకి తీసుకున్నారు. హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా వారిని అరెస్టు చేశారు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ సహకరించింది. ఆ ఇద్దరు నేరగాళ్లను ఇండియాకు డిపోర్ట్ చేసేందుకు అమెరికా పోలీసులతో హర్యానా ఎస్టీఎఫ్ టచ్‌లో ఉన్నది.
హిమాన్షు పూర్తి పేరు హిమాన్షు రిటోలియా. కానీ అతను హిమాన్షు సిగ్రోహ పేరుతో పాస్‌పోర్టు తీశాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు రైవల్‌గా హిమాన్షు నేరాలకు పాల్పడ్డాడు. హర్యానా, ఢిల్లీ పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్టులో అతను ఉన్నాడు. మర్డర్లు, కిడ్నాప్, బెదిరింపులకు పాల్పడినట్లు కేసులు ఉన్నాయి. ఇంటర్‌పోల్ నోటీసులోనూ అతను ఉన్నాడు. పోర్చుగల్‌లోనూ అతనికి లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ క్రిమినల్ నెట్వర్క్ గ్యాంగ్‌తో అతనికి సంబంధాలు ఉన్నాయి. నీరజ్ భవానా, నవీన్ బాలీ గ్యాంగ్లతోనూ అతనికి లింకున్నది.
మరో నేరస్థుడు నీరజ్ ఫర్దిపురియా.. హర్యానాలోని పాల్వాల్ జిల్లా. అతనిపై మొత్తం 25 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2012లో అతన్ని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. 2015లో మర్డర్ కేసులో అతనికి జీవితకాల శిక్ష పడింది. 2019లో హర్యానా, పంజాబ్ కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రతినిధి వికాశ్ చౌదరీ హత్య కేసులో అతని పేరు ఉన్నది. కానీ దుబాయ్ మీదుగా అతను కెనడాకు పారిపోయాడు. కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్‌కు ప్రత్యర్థి గ్యాంగ్‌లీడర్‌గా చేశాడు. ఆ తర్వాత అతను అమెరికా వెళ్లాడు. హిమాన్షుతో కలిసి పనిచేశాడు. యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పుల్లో అతను ఉన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

