అన్నదాతపై బీజేపీ గూండాలు దౌర్జన్యానికి దిగారు. రాళ్లు, రౌడీషీటర్లతో తెగబడ్డారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని చెల్లాచెదురు చేస్తూ అరాచకం సృష్టించారు. పలుకరింపు ముసుగులో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై వాలిన బండి ముఠా.. రైతులు నిలదీయడంతో తట్టుకోలేకపోయింది. యాసంగి ధాన్యం కొనలేమంటూ.. సజావుగా సాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడమెందుకని అన్నదాతలు ప్రశ్నించడంతో ఉక్కిరిబిక్కిరై.. అసహనంతో దాడులకు దిగింది. మీడియా, పోలీసులు, అన్నదాతకు అండగా నిలిచిన టీఆర్ఎస్ నాయకులపైనా రాళ్లు రువ్వి రక్తం కండ్ల చూసింది. ఆగ్రహానికి గురైన రైతాంగం నల్లగొండ నుంచి సూర్యాపేట వరకూ అడుగడుగునా బండి బ్యాచ్‌ను అడ్డుకున్నది. నల్లజెండాలు, నిరసనలు, నినాదాలతో హోరెత్తించింది. అంతిమంగా పాచిక పారని సంజయ్ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సోమవారం తోకముడవక తప్పని పరిస్థితిని ఏర్పడింది.