చింతకాని : తెలంగాణ ధాన్యం కొనుగోలుపై బీజేపీ సర్కారు స్పష్టతనివ్వాలని రాష్ట్ర సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ కోండబాల కోటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలో నాగులవంచ గ్రామంలో మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో రైతుబంధుసమితి జిల్లాకన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, మండల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలసి నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
అనంతరం ప్రధానమంత్రి మోఢీ దిష్టిబోమ్మ దహనం చేసి కేంద్రం దాన్యం కోనుగోలు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామశాఖ అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.