Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎట్టకేలకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈ సందర్భంగా దీపక్ రెడ్డి మాట్లాడుతూ.. టికెట్ వస్తుందని మొదటి నుంచీ నమ్మానని తెలిపారు. ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం కొత్త నష్టమేనని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్‌కు కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిందేమీ లేదని దీపక్ రెడ్డి అన్నారు. సానుభూతి ఉన్న బీఆర్ఎస్నే మాకు ప్రధాన పోటీ అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అసలు పోటీలోనే లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్ వేశారు. ఇవాళ షేక్‌పేట్ తహశీల్దార్ కార్యాలయంలో ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో సునీత వెంట కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్ వెళ్లారు.
మరోవైపు ట్రిపుల్ ఆర్ రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి రైతులు సిద్ధమయ్యారు. ఈ నెల 20 ల ఓపు ప్రభుత్వం స్పందించాలని అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే 21న నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు. మొత్తం 300 మంది నామినేషన్లు వేయాలని నిర్ణయం తీసుకున్నారు.