Jubilee Hills By Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ తొలి సెట్ నామినేషన్ వేశారు. షేక్‌పేటలోని తహశీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు పద్మారావు, రావుల శ్రీధర్‌రెడ్డి, దీదీప్య రావు, విష్ణువర్ధన్‌రెడ్డి, రాజ్‌కుమార్ పటేల్, సమీనా యాస్మిన్‌తో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. నవంబర్ 11న ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుండగా.. అదే నెల 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు.