Dragon | గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కాంబోలో NTR – Neel ప్రాజెక్టు రాబోతున్న విషయం తెలిసిందే. Dragon (వర్కింగ్ టైటిల్) టైటిల్‌తో తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఇప్పుడు మూవీ లవర్స్ క్యూరియాసిటీ పెంచేస్తుంది.
ఓటీటీ రిలీజ్ విషయం ఇప్పటికీ ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చయాంశమైన విషయం. ఓ వైపు మెజారిటీ సౌత్ ఫిలిమ్స్4 వారాల రిలీజ్ ప్లాన్ ఫాలో అవుతుంటే.. కొన్ని హిందీ సినిమాలు మాత్రం 8 వారాల విండో పీరియడ్‌తో థియేటర్లలో అంగీకారం కోసం ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో డ్రాగన్ సినిమాకు మేకర్స్ ఓటీటీ ప్లాన్ సెట్ చేశారన్న వార్త వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తాజా టాక్ ప్రకారం డ్రాగన్‌కు 8 వారాల విండో పీరియడ్‌ను ఫైనల్ చేశారని సమాచారం.
మేకర్స్ డ్రాగన్ ఓటీటీ డీల్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ కు భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్టు సమాచారం. డీల్ ప్రకారం డ్రాగన్ థ్రియాట్రికల్ రిలీజైన 8 వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. నార్త్ బెల్ట్‌లో సినిమాను ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయాలని ఉద్దేశంతో మేకర్స్ ఈ ఓటీటీ డీల్‌ను ఫైనల్ చేశారని సమాచారం. ఇక ఎన్టీఆర్ నటించిన వార్ 2 ఇదే పద్దతిలో ఓటీటీలో నేడు విడుదలైంది.
Read Also :
OG | థియేటర్లలో ‘ఓజీ’ ఘన విజయం ..ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌పై స్పెషల్ ఫోకస్..!
Ed Sheeran | ఇంటర్నేషనల్ కోలాబరేషన్.. బ్రిటీష్ పాప్ సింగర్‌తో సంతోష్ నారాయణన్ ఇండియన్ ఆల్బమ్
Tanuj Mouli | రూ. కోటి అడ్వాన్స్.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్.