న్యూఢిల్లీ : కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ అత్యంత ధనిక పార్టీగా నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ నిరుడు మార్చి 31 నాటికి ఏకంగా రూ.7,113.80 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్‌ను కలిగి ఉండగా.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ వద్ద రూ.857.15 కోట్ల నిధులు ఉన్నాయి.
ఈ విషయాలను ఆయా పార్టీలే ఎన్నికల కమిషన్‌కు నివేదించాయి. ఆ లెక్కల ప్రకారం.. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ రూ.1,754.06 కోట్లు ఖర్చు చేసింది. ఇది 2022-23లో ఖర్చు చేసిన రూ.1,092 కోట్ల కంటే 60% అధికం. కాంగ్రెస్ పార్టీ ఖర్చు 2023-24లో రూ.619.67 కోట్లకు పెరిగింది.