రైతులు ఆందోళన చేసినా పట్టించుకోవట్లే..
టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు నిలదీసినా స్పందించదు
రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కుక్కల్లా మొరుగుతున్నారు
యాసంగిలో వరి సాగు చేసి రైతులు రోడ్డున పడాలనే కుట్రలు
బీజేపీ ఎంపీలది పైశాచిక ఆనందం
నిప్పులు చెరిగిన రాష్ట్ర మంత్రి పశాంత్ రెడ్డి
రైతులతో రాజకీయం చేస్తే ఉసురు తప్పదు
వారి కుటుంబాలను రోడ్డుపాలు చేసేందుకే బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు
సీఎం కేసీఆర్‌పై అనవసర విమర్శలు చేస్తే బుద్ధిచెప్తాం : మంత్రి ప్రశాంత్‌రెడ్డి
ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం: స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
మంత్రి వేములతో కలిసి రుద్రూర్ వ్యవసాయ పరిశోధనా స్థానంలో పరిపాలనా భవనాన్ని ప్రారంభించిన సభాపతి
రుద్రూర్, డిసెంబర్ 29 : రైతులతో రాజకీయం చేస్తే వారి ఉసురు తప్పదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రైతులను తప్పుదోవ పట్టించి వారి కుటుంబాలను రోడ్లపైకి తీసుకురావాలని కుట్రలు పన్నుతున్న బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్‌రెడ్డిది సిగ్గులేని రాజకీయమని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలకేంద్రంలో ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానంలో రూ. 2కోట్ల14లక్షల వ్యయంతో నిర్మించిన పరిపాలనా భవనాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. ముందుగా వరి పరిశోధనా స్థానం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను వారు పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పెట్టుబడి తగ్గించి ఆదాయాన్ని పెంచేలా ప్రయోగాలు చేసి రైతులకు మేలు చేకూరుస్తున్న శాస్త్రవేత్తల సేవలు అభినందనీయమని అన్నారు. సమైక్య పాలనలో పరిశోధనా స్థానం నిరాదరణకు గురైందని గుర్తుచేశారు. నేడు రైతులకు శాస్త్రవేత్తలు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేలా కృషిచేసిన సీఎం కేసీఆర్ గొప్పతనాన్ని దేశం నలుమూలలా చెప్పుకోవచ్చునని అన్నారు. రైతే రాజు అని, అనేక సంక్షేమ పథకాలను అందజేసి అన్నదాతకు అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఇవన్నీ చేస్తున్న సీఎం కేసీఆర్‌పై అనవసర రాజకీయం చేస్తే బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాను 7,600 మెగావాట్ల నుంచి 16,600 మెగావాట్లకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు.
ఉపాధి లక్ష్యం నెరవేరుతున్నది..
స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిరుద్యోగులకు అవకాశాలను పెంచి అందరికీ ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇప్పటివరకు సీడ్, ఫుడ్ టెక్నాలజీ కళాశాలలో చదివిన 94 మంది విద్యార్థులు ఉపాధి పొందడం గర్వించదగిన విషయమని, రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయని అన్నారు. రుద్రూర్‌లోని ఆహార సాంకేతిక పరిజ్ఞాన కళాశాల దేశంలోనే 13వదని, అలాంటి సంస్థ మన జిల్లాలో ఉండడం సంతోషకరమని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించి పంపడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, ధాన్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. రైతుల విషయంలో కేంద్రం తన బాధ్యతలను విస్మరిస్తే పోరాడాల్సింది పోయి.. ప్రతిపక్ష నాయకులు అనవసర రాజకీయాలు చేసి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నాబార్డ్ ఏజీఎం నగేశ్, ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, పరిశోధనా స్థానం సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్, ఉపసంచాలకురాలు ఉమాదేవి, రీసెర్చ్‌స్టేషన్ ఇన్చార్జి బాలూనాయక్, ఎంపీపీ నాగేందర్, జడ్పీటీసీ గంగారాం, సర్పంచ్ గంగామణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, రైతులు పాల్గొన్నారు.