హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తేతెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక బీజేపీ కుట్ర దాగి ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘వికసిత్ భారత్’లో తెలంగాణ రాష్ట్రం ఉండొద్దనే ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నట్టు అర్థం అవుతుందని అనుమానం వ్యక్తంచేశారు. ఈ నెల 25న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఓబీసీ మహాసభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.