Mancherial | మంచిర్యాలలో చీలిన అధికార కాంగ్రెస్.. పీఎస్ఆర్ వర్సెస్ జగన్ వర్గంగా చీలిన పార్టీ
Mancherial | మంచిర్యాల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్‌లో చీలిక ఏర్పడింది. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు (పీఎస్ఆర్), అసమ్మతి నేత జగన్మోహన్రావు (జగన్) రెండు వర్గాలుగా చీలిపోయారు.
Mancherial | మంచిర్యాల, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్‌లో చీలిక ఏర్పడింది. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు (పీఎస్ఆర్), అసమ్మతి నేత జగన్మోహన్రావు (జగన్) రెండు వర్గాలుగా చీలిపోయారు. మంచిర్యాలలో వెంకటస్వామి విగ్రహావిష్కరణ వ్యవహారం మరువకముందే.. మంచిర్యాలకు చెందిన 8 మంది కార్పొరేటర్లు, లక్షెట్టిపేటకు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు, దండేపల్లికి చెందిన ఇద్దరు సర్పంచ్‌లు, ఇద్దరు ఉపసర్పంచ్లు, మాజీ సర్పంచ్ శుక్రవారం జగన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మంత్రి వివేక్, ఎంపీ వంశీని కలువడంతో వర్గవిభేదాలను బట్టబయలు చేశాయి.
లక్షెట్టిపేటలో కాంగ్రెస్ కౌన్సిలర్లు 9 మంది ఉంటే.. ముగ్గురు జగన్ వర్గీయులుగా తెరపైకి వచ్చారు. మంచిర్యాలలో 8 మంది కార్పొరేటర్లు ఆయన పక్కన చేరడం పార్టీని కుదిపేస్తున్నది. జగన్మోహన్రావుతో పలువురు నేతలు త్వరలోనే అంతా ఆయన పక్షంలో చేరుతారని వారి వర్గం చెప్పుకొంటుంటే.. లేదు ఎమ్మెల్యే వెంటే ఉన్నారంటూ పీఎస్ఆర్ వర్గం చెప్తున్నది. మొన్నటికి మొన్న 53 మంది కార్పొరేటర్లు పీఎస్ఆర్ ఇంట్లో ప్రెస్‌మీట్ పెట్టి ఎమ్మెల్యే వెంటే ఉంటామని ప్రకటించి.. తీరా వారిలో 8 మంది జగన్‌తో అంటకాగడం పీఎస్ఆర్ వర్గానికి మింగుడుపడటం లేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narsingi Road | బిగ్ రోడ్.. బిగ్ దందా.. నార్సింగి రోడ్ అలైన్మెంట్లో తవ్వినకొద్దీ అక్రమాలు
Mallanna Sagar | మల్లన్నసాగర్ పైనా మేడిగడ్డ కుట్ర.. 16 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే జలాశయం చుట్టూ భారీ పేలుళ్లు
Horoscope | 30-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
రియల్ అల్లకల్లోలం
తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

