హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ స్విమ్మర్ సుహాస్ ప్రీతమ్ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో రెండో స్వర్ణం సొంతం చేసుకున్నాడు. భువనేశ్వర్‌లో శుక్రవారం జరిగిన పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్ రేసును 26.95 సెకన్లలోనే పూర్తి చేసిన సుహాస్ అగ్రస్థానంలో నిలిచాడు.
కర్నాటక స్విమ్మర్లు ఆర్యన్ అభిజిత్ (27.54 సె) రజతం, అమన్ అభిజిత్ (27.57 సె) కాంస్యం గెలిచారు.