నవాబుపేట : మండల పరిధిలోని ఏక్మామిడి గ్రామానికి చెందిన బీజేపీ( BJP) , కాంగ్రెస్ ( Congress ) పార్టీకి చెందిన 30 మంది నాయకులు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ( MLA Sabhita Reddy) , రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నవాబుపేట మండల అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి నాయకత్వంలో అందరం కలిసి కట్టుగా పనిచేస్తూ పార్టీని మండలంలో విస్తరించడానికి కృషి చేస్తామని అన్నారు.
పార్టీ విధానాలకు కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి ఎనలేని సేవలందించన కేసీఆర్‌కు అండగా ఉంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల గౌరవ అధ్యక్షుడు పట్లోళ్ల భరత్‌రెడ్డి, సలహదారు మందుల విజయ్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్లు పురుషోత్తంచారి, శాంతికుమార్, ప్రచార కార్యదర్శి ఆసిరెడ్డిగారి వెంకట్‌రెడ్డి, యూత్ వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.