Bhumana Karunakar Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ స్పందించింది. సత్యమేవ జయతే అంటూ అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వాగతించారు. ధర్మాగ్రహాన్ని గుర్తించి.. సుప్రీంకోర్టు ధర్మాసనం సత్యం చెప్పిందన్నారు. పదవి ఉందని పెదవి జారితే, అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తే.. భక్త ద్రోహం చేయాలని చూస్తే ఇలానే ఉంటుందంటూ విమర్శించారు. తిరుమల లడ్డూపై జరిగిన దుర్మార్గపు ప్రచారం.. మొత్తం ప్రపంచాన్ని కలిచివేసిందని అన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలతో హిందూ సమాజంలో భయానక వాతావరణం ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భగవంతుడు ఆగ్రహించి ధర్మాసనం రూపంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయించినట్లు భావిస్తున్నామన్నారు. టీటీడీ ఈవో చెప్పిన మాటలకు భిన్నంగా.. సీఎం చంద్రబాబు జంతువులు కొవ్వు వాడారని ఎలా చెబుతారని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ విషయంలో తప్పు జరిగింది అంటూ విషప్రచారం చేశారని మండిపడ్డారు. తప్పు చేయలేదు కాబట్టే దైర్యంగా తాము విచారణ కోరామని భూమన అన్నారు. స్వామి వారి వైభవాన్ని తగ్గించే విధంగా చంద్రబాబు, పవన్ మాట్లాడుతున్నారని హిందూ సమాజం వారిని చీకొడుతోందని ఆయన అన్నారు.
బాబు, పవన్‌పై ప్రకాశ్‌రాజ్ మళ్లీ ట్వీట్
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ ఎక్స్ స్పందించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను జోడిస్తూ చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ పోస్టును షేర్ ఆ ఫొటో కింద దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి అంటూ ప్రకాశ్ దీంతో ఆయన వ్యాఖ్యలు మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారాయి. ఈ వివాదానికి సంబంధించి ప్రకాశ్‌రాజ్ చేసిన కామెంట్స్ పవన్ పాటు జనసేన నాయకులు, మూవీ ఆర్టిస్ మంచువిష్ణు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా మరోసారి ప్రకాశ్ వివాదంపై స్పందిస్తూ ఎక్స్ పోస్టు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.