Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
Bernie Sanders | భారత్‌లో స్టార్‌లింక్ ఉపగ్రహ (Starlink Satillite) ఇంటర్నెట్ సేవల (Internet Services) కు అనుమతుల జాప్యంపై ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) చేస్తున్న విమర్శలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఆయనపై అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్ (Bernie Sanders) ఎదురుదాడి చేశారు.
Bernie Sanders : భారత్‌లో స్టార్‌లింక్ ఉపగ్రహ (Starlink Satillite) ఇంటర్నెట్ సేవల (Internet Services) కు అనుమతుల జాప్యంపై ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) చేస్తున్న విమర్శలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఆయనపై అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్ (Bernie Sanders) ఎదురుదాడి చేశారు. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో మస్క్ 290 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారని వెల్లడించారు.
ఆ ఖర్చుకు ఫలితం లభించిందని, ఆ తర్వాత మస్క్ సంపద 696 బిలియన్ డాలర్లు (రూ.66 లక్షల కోట్లు) పెరిగి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మారారని సాండర్స్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మస్క్ అక్కడితో ఆగలేదని, అమెరికా కాంగ్రెస్‌లో రిపబ్లికన్ల పట్టు కొనసాగించేందుకు 366 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ‘మస్క్‌ను ఆపండి కుబేరుల రాజ్యానికి ముగింపు పలకండి’ అంటూ సాండర్స్ నినదించారు.
కాగా, భారత్‌లో తన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించకుండా కొందరు ఒలిగార్క్‌లు అడ్డుకుంటున్నారని, తద్వారా వారు భారత్‌లో తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారని మస్క్ ఇటీవల ఆరోపించారు. బీజేపీ ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లో ముమ్మరం చేయడానికి అవసరమైన నిధులను రిలయన్స్‌తో సంబంధం ఉన్న కంపెనీ సమకూర్చిందంటూ మీడియా కథనాలను షేర్ చేశారు. ఇప్పుడు మస్క్‌ను ఉద్దేశించి సాండర్స్ అలాంటి విమర్శలే చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్‌వుడ్‌కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

