RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveenkumar | కావాలనే కుట్రతోతోనే ఈ జీవో నంబర్ 134 తీసుకురావాలని ముందే నిర్ణయించుకొని కుట్ర చేసి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేబినెట్ మంత్రులంతా కుట్ర చేసి కావాలనే 7వ తారీఖున అసెంబ్లీ ముందర బీఆర్ఎస్ నాయకులను లోపలికి రానీయకుండా.. అసెంబ్లీ సమావేశాలకు వాళ్లను రాకుండా పూర్తిగా సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
RS Praveenkumar | తెలంగాణ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుకు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేఖ రాశారు. భూములపై విచారణ జరిపేందుకు వేసిన కమిటీలో రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుల భూముల గురించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ నాయకుల ఆస్తుల వివరాలు ఆధారాలతో సహా జతచేసి లేఖ రాశారు.
ఈ విషయమై తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నేను బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ హోదాలో ఒక మాజీ అఖిల భారత సర్వీసుల అధికారిగా, మాజీ ఐపీఎస్ అధికారిగా చెప్తున్న ఈ జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం, ఆర్టికల్ 14కు వ్యతిరేకం. ఈ దేశంలో అందరికీ కూడా సమానత్వపు హక్కు ఉన్నది. ఇక్కడ పెట్టిన భూములన్నీ కూడా కేవలం బీఆర్ఎస్ నాయకుల భూములే.. కావాలని కక్ష కట్టి చేశారని నేను ముందే చెప్పిన.. సమస్యల మీద పోరాడుతున్నమని చెప్పి, ప్రభుత్వానికి కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నామని కసితో కక్షతో ఇవన్నీ పెట్టి ఆర్టికల్ 14ను ఉల్లంఘించారని ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వంలో ఉండే చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుకు ఒక లెటర్ రాస్తున్నా. ఆ లేఖను ఈ రోజు మీడియా సమక్షంలో విడుదల చేద్దామని అనుకున్నా.. ముఖ్యంగా అందులో నుంచి నేను చెప్పేదేమంటే.. 16.09.2026న అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా కూడా ఏక్షపక్షం. కావాలనే కుట్రతోతోనే ఈ జీవో తీసుకురావాలని ముందే నిర్ణయించుకొని కుట్ర చేసి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేబినెట్ మంత్రులంతా కుట్ర చేసి కావాలనే 7వ తారీఖున అసెంబ్లీ ముందర బీఆర్ఎస్ నాయకులను లోపలికి రానీయకుండా.. వాళ్లమీద చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో దౌర్జోన్యం చేసి, మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యం చేసి, అఘాయిత్యాలు చేసి అసెంబ్లీ సమావేశాలకు పూర్తిగా వాళ్లను రాకుండా సస్పెండ్ చేశారు.
ఆ తర్వాత జరిగిన ఏక్షపక్ష డిస్కషన్ ఏదైదో ఉందో.. కావాలని బీఆర్ఎస్ నాయకుల భూములను పెట్టి అసెంబ్లీలో వాళ్ల సంజాయిషీ కూడా ఇచ్చుకునే అవకాశం లేకుండా.. దాని మీద చర్చ చేసే అవకాశం కూడా వాళ్లకు లేకుండా చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే సమస్యలన్నింటినీ కూడా ప్రస్తావించడానికి బీఆర్ఎస్ నాయకులు అద్భుతంగా ప్రిపేరై పోయినా ఆ చర్చను కూడా వాళ్లకు వచ్చే అవకాశం లేకుండా చేశారన్నారు.
తెలంగాణ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుకు ఆర్ఎస్ ప్రవీణ్ లేఖ
భూములపై విచారణ జరిపేందుకు వేసిన కమిటీలో రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుల భూముల గురించి విచారణ జరపాలని డిమాండ్
కాంగ్రెస్ నాయకుల ఆస్తుల వివరాలు ఆధారాలతో సహా జతచేసి లేఖ రాసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ https://t.co/RxU4uCoreL
— Telugu Scribe (@TeluguScribe) October 13, 2026
Read Also :
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
Comrade Kalyan | బాక్సాఫీస్ వద్ద శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు.. హిట్‌గా నిలిచిన కామెడీ డ్రామా!
Piyush Goyal | సీఈసీలకు పద్మ అవార్డుల్ని కాంగ్రెస్ లంచాలుగా ఇచ్చింది.. కేంద్ర మంత్రి పీయూష్ సంచలన ఆరోపణ
ఎంజీయూ పీజీ, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

