Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Dubai Bathukamma Celebrations | దుబాయ్‌లో నివసిస్తున్న తెలంగాణ ప్రాంత ప్రజలు, కుటుంబ సభ్యులు గల్ఫ్ తెలంగాణ ఫోరం (GTF) ఆధ్వర్యంలో దుబాయ్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు.
Bathukamma Celebrations | దుబాయ్: గల్ఫ్ తెలంగాణ ఫోరం (GTF) ఆధ్వర్యంలో అక్టోబర్ 11న దుబాయ్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను విదేశీ గడ్డపై ఘనంగా నిర్వహించి తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పారు. దుబాయ్‌లో నివసిస్తున్న తెలంగాణ ప్రాంత ప్రజలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు.
తెలంగాణ నుంచి విచ్చేసిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి , కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ , నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ , నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల , ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ , ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి , బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ , బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు మహేశ్ బిగాల , రాష్ట్ర నాయకురాలు ఐశ్వ షకీల్ తదితర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జీటీఎఫ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆకుల సురేందర్ పటేల్ ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీలు బాలరాజ్ గౌడ్ , యుజ్వేంద్ర , వైస్ ప్రెసిడెంట్లు శ్రీకాంత్ , రాజేశ్ , కోఆర్డినేటర్ రాజేశ్వర్, అభినవ్, చంద్రకాంత్ గుప్తా, రవన్నతో పాటు జీటీఎఫ్ కోఆర్డినేటర్లు, కార్యవర్గ సభ్యులు, వాలంటీర్లు సమష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మహిళా విభాగం తరపున కళ్యాణి, లక్ష్మీ అక్క, కల్పన, మమత, ఉషశ్రీ, వైదేవి, వేద, స్వాతి, లక్ష్మీసతీశ్ రెడ్డి , సీ.ఎస్.ఆర్ , ఆనంద్ రెడ్డి , ప్రశాంత్ , మహేశ్, రాజ్‌కుమార్ గారు, రజనీకాంత్, వెంకటేశ్, నక్క లక్ష్మణ్, అనుషా శ్రీకాంత్ , అనుషా , శ్రీహరి రెడ్డి , కేశవిని సతీష్, ఉదయ్ కుమార్ , శ్వేత, అరుంధతి రాజ్ , మురళి, రజిత , సునీత, సుధా , శేఖర్ , లీల , సంపత్ కుమార్, జీటీఎఫ్ బృందంలోని ప్రతి ఒక్కరి సమిష్టి సహకారంతో బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయగలిగాము. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తదితర మహిళా సభ్యులు చురుకుగా పాల్గొని బతుకమ్మ సంబరాలను సంప్రదాయబద్ధంగా, ఎంతో ఉత్సాహంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు, తెలంగాణ ఆడపడుచుల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
తెలంగాణ సంప్రదాయ వంటకాలతో విందు..
తెలంగాణలోని పల్లె సంస్కృతిని, సంప్రదాయాలను గుర్తు చేస్తూ చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఆనందోత్సాహాలతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు, తెలంగాణ ప్రవాసులు, కుటుంబ సభ్యులందరికీ జీటీఎఫ్ ఆధ్వర్యంలో చక్కటి ఏర్పాట్లు చేసి, రుచికరమైన తెలంగాణ సంప్రదాయ వంటకాలతో విందు భోజనాలు ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆత్మీయ ఆతిథ్యం అందిస్తూ, అందరూ సంతోషంగా వేడుకల్లో పాల్గొనేలా నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తెలంగాణ సంస్కృతిని భావితరాలకు అందించడమే జీటీఎఫ్ ప్రధాన లక్ష్యం విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలను భావితరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో జీటీఎఫ్ నిరంతరం కృషి చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.
బతుకమ్మ సంబరాలకు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి అతిథికి, తెలంగాణ నాయకులకు, మహిళలకు, యువతకు, కుటుంబ సభ్యులకు, దాతలకు, స్పాన్సర్లకు, వాలంటీర్లకు జీటీఎఫ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరూ జీటీఎఫ్ కుటుంబంలో భాగస్వాములేనని, అందరి సమష్టి కృషి, సహకారం, ఆత్మీయత వల్లే ఈ బతుకమ్మ సంబరాలు ఇంతటి ఘనవిజయాన్ని సాధించాయని జీటీఎఫ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆకుల సురేందర్ పటేల్ గారు పేర్కొన్నారు.









Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

