Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ప్రజలకు తాగునీళ్లు ఇవ్వలేమని చెప్పడం సిగ్గుచేటు. నాడు రైతులను కేసీఆర్ అన్ని విధాల ఆదుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ఎవరికి భరోసా ఇవ్వని పాలన నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు సాగు నీళ్లు, ప్రజలకు తాగునీళ్లు ఇవ్వలేమని చెప్పడం సిగ్గుచేటు. నాడు రైతులను కేసీఆర్ అన్ని విధాల ఆదుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్థంగా మారింది. మంత్రులు నేల విడిచి సాము చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చి రాగానే మెట్రో విస్తరణ ప్రాజెక్టును రద్దు చేశారు. ఇపుడు బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తామని చెబుతున్నారు. రైతుల భూములు ప్రభుత్వ భూములని బలవంతంగా సేకరిస్తున్నారని విమర్శించారు.
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు అలైన్ మెంట్ ఖరారు కాలేదని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పష్టం చేశారు. బుల్లెట్ ప్రాజెక్టు ఎక్కడ వస్తుందో తెలియనప్పుడు బహుదూర్ గూడ రైతుల భూములను పోలీసుల పహారాలో ఎందుకు లాక్కున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారని ప్రశ్నించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కన్నా సీఎంకు సొంత ప్రయోజనాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో నలుమూలల బలవంతపు భూముల సేకరణ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేని కోసమో చెప్పకుండా భూ సేకరణ చేసి రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. నిన్న లగచర్లలో బలవంతపు భూ సేకరణకు నిరసనగా రైతు ఆత్మ హత్యయత్నానికి పాల్పడ్డారు. వేల ఎకరాలు లాక్కొని రైతులను సీఎం రోడ్డున పడేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్వాల్ గూడ నుంచి కొడంగల్ కు పెద్ద రోడ్డు వేస్తున్నారు. ఇప్పటికే శంషా బాద్ నుంచి మంచి రోడ్డు ఉంది. ఇంకో రోడ్డు దేనికోసమని నిలదీశారు. సీఎం భూ దాహానికి హద్దే లేదా ? నా నియోజకవర్గంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పేరిట రైతుల భూములను అవసరం లేకున్నా సేకరించారన్నారు. రైతులు ప్రభుత్వ తీరుతో భయబ్రాంతులకు లోనవుతన్నారు.
నాదర్ గుల్ ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూముల అంటూ అక్కడికి ఎవరిని వెళ్లనివ్వడం లేదు. చట్ట విరుద్ధంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు హద్దులు పాతడంపై కేంద్ర మంత్రి జి .కిషన్ రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూ దందాలు, అరాచకాలకు సీఎం వెంటనే తెరదించాలన్నారు. కార్యక్రమంలో
ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఇంచార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

