Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
Ayushmann Khurrana | బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, టాలెంటెడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న తాజా యాక్షన్-కామెడీ చిత్రం ‘ఉడ్తా తీర్’(Udta Teer).
Ayushmann Khurrana | బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, టాలెంటెడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న తాజా యాక్షన్-కామెడీ చిత్రం ‘ఉడ్తా తీర్’(Udta Teer). ఆకాష్ ఎ. కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి కొత్త ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా ‘బిలాల్’ అనే పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. రహస్య మిషన్‌లో భాగంగా భారత్‌కు వచ్చిన అతను, అనుకోని ప్రమాదం కారణంగా తన జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. ఇక అసలు కథ అక్కడి నుంచే మొదలవుతుంది. జ్ఞాపకశక్తి కోల్పోవడంతో తాను పాకిస్థాన్ తరఫున గూఢచారిగా వచ్చానన్న విషయాన్ని పూర్తిగా మరచిపోతాడు. అంతేకాదు, భారతదేశంలో ఉంటున్న సమయంలో అతడిలో విపరీతమైన దేశభక్తి పుట్టుకొచ్చి, తనే స్వయంగా ఇండియా కౌంటర్ టెర్రరిజం స్క్వాడ్ (CTS) ఆఫీసర్ అని బలంగా నమ్ముకుంటాడు. పాకిస్థాన్ పంపిన గూఢచారి అనుకోకుండా ఇండియాకు అనుకూలంగా మారిపోయి, అక్కడే దేశభక్తుడిగా తిరుగుతుండటంతో పాకిస్థాన్ హ్యాండ్లర్లకు తలనొప్పిగా మారుతుంది. అయితే అనంతరం జరిగిన సంఘటనలు ఏంటి అనేది ఈ సినిమా కథ. ఇందులో సారా అలీ ఖాన్ పవర్ ఫుల్ సీటీఎస్ ఆఫీసర్‌గా సందడి చేయనున్నారు.
ఈ చిత్రంతో ఆకాష్ కౌశిక్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, కరణ్ జోహార్‌కు చెందిన ‘ధర్మ ప్రొడక్షన్స్’ మరియు గునీత్ మోంగాకు చెందిన ‘సిఖ్యా ఎంటర్టైన్మెంట్’ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రాహుల్ బోస్, రామ్ కపూర్, గుషన్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్‌వుడ్‌కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
Comrade Kalyan | బాక్సాఫీస్ వద్ద శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు.. హిట్‌గా నిలిచిన కామెడీ డ్రామా!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

