SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్‌వుడ్‌కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
SA vs AUS : డర్బన్ టెస్టులో దక్షిణాఫ్రికా (South Africa) పోరాడుతోంది. నాలుగో రోజు క్రీజునంటుకున్న ఎడెన్ మర్క్రమ్(75 నాటౌట్) ఐదో రోజూ తొలి సెషన్లోనే రెండు వికెట్లు పడినా అదే పట్టుదలతో ఆడుతున్నాడు.
SA vs AUS : డర్బన్ టెస్టులో దక్షిణాఫ్రికా (South Africa) పోరాడుతోంది. నాలుగో రోజు క్రీజునంటుకున్న ఎడెన్ మర్క్రమ్(75 నాటౌట్) ఐదో రోజూ తొలి సెషన్లోనే రెండు వికెట్లు పడినా అదే పట్టుదలతో ఆడుతున్నాడు. ప్రధాన ఆటగాళ్లు పెవిలియన్ చేరడంతో మార్కో యాన్సెన్(35) జతగా జట్టును గెలిపించాలనుకున్నాడు. కానీ, అప్పటికే మూడు వికెట్లు తీసిన హేజిల్‌వుడ్(5-44) ఒకే ఓవర్లో యాన్సెన్, సైమన్ హార్మర్ వికెట్లు తీశాడు. అంతే అప్పటివరకు గెలుపుపై ధీమాతో ఉన్న ఆతిథ్య జట్టు ఆలౌట్ ప్రమాదంలో పడింది.
స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 421 పరుగుల ఛేదనలో ఎడెన్ మర్క్రమ్(75 నాటౌట్) నిలబడినా అతడికి సహకరించేవాళ్లు కరువయ్యారు. ఐదో రోజు తొలి సెషన్లోనే చెలరేగిన ఆసీస్ బౌలర్లు సఫారీలను ఒత్తిడిలో పడేశారు. మల్డర్ ఔటైన కాసేపటికే.. కైలీ వెర్రియన్(1)ను రెన్షా వెనక్కి పంపగా.. టాపార్డర్‌ను పడగొట్టిన హేజిల్‌వుడ్(5-44) ఒకే ఓవర్లో మార్కో యాన్సెన్(35, సైమన్ హార్మర్(0)లను ఔట్ చేసి ఐదో వికెట్ల ప్రదర్శన చేశాడు.
IT’S HAZLEGOD TIME!
An unplayable ball gets him a top-quality five-for in Durban 🔥
▶️ https://t.co/6TiDPp4rOq https://t.co/IX7QCfrANf
— Cricinfo (@cricinfo) October 13, 2026
దాంతో.. మల్డర్ వికెట్‌కు ముందు 155-5తో పటిష్ట స్థితిలోనే ఉన్న సఫారీ జట్టు హేజిల్‌వుడ్ విజృంభణతో 201-8కు పడిపోయింది. ప్రస్తుతం మర్క్రమ్ జతగా కేశవ్ మహరాజ్ ఆడుతున్నాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో రెండొందలకుపైగా బంతులాడిన మర్క్రమ్.. ఆసీస్ బౌలర్లను విసిగిస్తూ అర్ధ శతకం సాధించాడు. కమిన్స్ సేన విజయానికి రెండు వికెట్లు మాత్రమే అవసరమవ్వగా.. తెంబా బవుమా జట్టుకు ఇంకా 220 రన్స్ కావాలి. దాంతో.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆసీస్ గెలుపు లాంఛనమే అనిపిస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్‌వుడ్‌కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
Comrade Kalyan | బాక్సాఫీస్ వద్ద శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు.. హిట్‌గా నిలిచిన కామెడీ డ్రామా!
Piyush Goyal | సీఈసీలకు పద్మ అవార్డుల్ని కాంగ్రెస్ లంచాలుగా ఇచ్చింది.. కేంద్ర మంత్రి పీయూష్ సంచలన ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

