Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
Parnasala Movie | హారర్ కామెడీ జోనర్లో వస్తున్న ‘పర్ణశాల’ చిత్రం నుంచి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ‘జిమ్ జిమ్ తార’ పూర్తి పాటను చిత్ర యూనిట్ ప్రముఖ ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల చేసింది.
Parnasala Movie | హారర్ కామెడీ జోనర్లో వస్తున్న ‘పర్ణశాల’ చిత్రం నుంచి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ‘జిమ్ జిమ్ తార’ పూర్తి పాటను చిత్ర యూనిట్ ప్రముఖ ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల చేసింది. జి.లక్ష్మిదేవి రచించి, స్వయంగా ఆలపించిన ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. కాగా, తాజాగా ఫుల్ సాంగ్ విడుదల కావడంతో సినిమాపై అంచనాలు మరింత తారాస్థాయికి చేరాయి.
ఈ సందర్భంగా దర్శకుడు వై.జి. భరత్ మాట్లాడుతూ మా చిత్రంలోని ఈ పాటకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో అద్భుతమైన స్పందన వస్తోందని, ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ పాటకు నెటిజన్లు రీల్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారని, పూర్తి పాట కూడా అందరినీ అలరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి పాట అధికారికంగా రాకముందే దీనికి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఎస్ఎల్టీ ఫిలిమ్స్ పతాకంపై మంచి వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్, కామెడీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినూత్న ప్రచార కార్యక్రమాలతో దూసుకుపోతున్న ఈ చిత్రానికి అశోక్ దయ్యాల పీఆర్ఓగా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
Comrade Kalyan | బాక్సాఫీస్ వద్ద శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు.. హిట్‌గా నిలిచిన కామెడీ డ్రామా!
Piyush Goyal | సీఈసీలకు పద్మ అవార్డుల్ని కాంగ్రెస్ లంచాలుగా ఇచ్చింది.. కేంద్ర మంత్రి పీయూష్ సంచలన ఆరోపణ
ఎంజీయూ పీజీ, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
Jailer 2 | ఓటీటీ వివాదం.. ఆ మల్టీప్లెక్స్‌లలో ‘జైలర్ 2’ హిందీ వెర్షన్‌కు నో ఎంట్రీ!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

