బెంగళూర్‌లో వరద కష్టాలు : ఒక రాత్రికి రూ. 40,000 పలికిన హోటల్ రూమ్‌లు!
పోటెత్తిన వరదతో బెంగళూర్‌లో జనజీవనం అస్తవ్యస్తమైంది. జనావాసాలు నీట మునిగిన ప్రాంతాల్లో హోటళ్లకు గిరాకీ పెరిగింది.
బెంగళూర్ : పోటెత్తిన వరదతో బెంగళూర్‌లో జనజీవనం అస్తవ్యస్తమైంది. జనావాసాలు నీట మునిగిన ప్రాంతాల్లో హోటళ్లకు గిరాకీ పెరిగింది. నగరంలోని పలు హోటళ్లు ఒక్క రాత్రికి సగటున ఏకంగా రూ 30,000 నుంచి రూ 40,000 వరకూ వసూలు చేస్తున్నాయి. అధిక ధర చెల్లించేందుకు సిద్ధమైన ప్రజలకు సరిపడా హోటల్ రూమ్‌లు దొరకడం లేదు.
ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో హోటల్ రూం కోసం ఒక్క రాత్రికి తాను రూ 42,000 చెల్లించానని ఓ టెక్నాలజీ కంపెనీ సీఈవో మీనా గిరిసబల్ల చెప్పారు. ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్, వైట్‌ఫీల్డ్, అవుటర్ రింగ్‌రోడ్, కోరమంగళ ప్రాంతాల్లోని పలు హోటళ్లు శుక్రవారం వరకూ పూర్తిగా బుక్ అయ్యాయి. పది నుంచి పదిహేను రోజుల వరకూ రూమ్‌లు బుక్ అయ్యాయని హోటల్ మేనేజర్లు చెబుతున్నారు.
ఇక భారీ వర్షాలతో బిలియనీర్లు ఉండే ప్రాంతాలు సైతం నీట మునిగాయి. విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ, బైజూస్ రవీంద్రన్, బ్రిటానియా సీఈవో వరుణ్ బెర్రీ వంటి దిగ్గజ బిలియనీర్లు ఉండే ఎప్పిలన్ గేటెడ్ కమ్యూనిటీ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బిలియనీర్లను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

