ఇండియాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత అర్ధంతరంగా ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. సౌతాఫ్రికాతో తన చివరి మ్యాచ్ ఆడేశాడు. డర్హమ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసిన స్టోక్స్ అభిమానులను నిరాశ పరిచాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత తన క్యాప్‌ను స్టేడియంలో ఉన్న ఒక ఫ్యాన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చేసి అందరి మనసులు గెలుచుకున్నాడు.
అతను అవుటై మైదానం వీడే సమయంలో కూడా ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతూ స్టోక్స్‌కు వీడ్కోలు పలికారు. ఈ మ్యాచ్‌లో ఐదు ఓవర్లు బౌలింగ్ చేసిన స్టోక్స్.. ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. అయితే తన క్యాప్‌పై సంతకం చేసి మరీ ఒక పిల్లాడికి ఇవ్వడంతో నెటిజన్లు ఆ బాలుడి అదృష్టాన్ని మెచ్చుకుంటున్నారు.
A class act until the end 🙌@benstokes38 gave his final cap to this young lad as he walked off the pitch!#ENGvSA pic.twitter.com/MXzDx7EUaX
— England’s Barmy Army (@TheBarmyArmy) July 19, 2022