యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బుధవారం నుంచి 14వ తేదీన వరకు బతుకమ్మ పండుగలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్. గీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదాద్రి కొండపై కార్యనిర్వహణాధికారి
క్యాంపు కార్యాలయ అవరణలో ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు బతుకమ్మ ఆట నిర్వహి స్తున్నట్లు తెలిపారు. 11వ తేదీన బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహిస్తామని ఈ వేడుకల్లో జిల్లా ఉన్నతాధికారు లు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.