ఢిల్లీ : బంగ్లాదేశ్లో మళ్లీ హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా గత సంవత్సరం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఢాకాలోని ప్రత్యేక ట్రిబ్యునల్ కోర్టు ఈ నెల 17న తీర్పు వెలువడించనున్నది. ఈ క్రమంలో అవామీ లీగ్ పార్టీ కోర్టు ఇచ్చే తీర్పుకు నిరసనగా దేశవ్యాప్తంగా లాక్డౌన్కు పిలుపునిచ్చింది.
దీంతో చాలా ప్రాంతాల్లో అల్లర్లు, దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం దేశ రాజధానితోపాటు, తీర్పును వెలువరించే ప్రాంతంలో గత ఘటనలు దృష్టిలో ఉంచుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అనుమానిత ప్రాంతాల్లో భద్రతను పటిష్ఠం చేశారు.