నల్లగొండ : బాలికను లైంగిక వేధింపులను గురి చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో నకిరేకల్‌లో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాలికను లైంగిక వేధింపులకు గురి చేసిన నిందితుడు బండి భగీరథపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
పోక్సో కేసు నమోదై ఏడు రోజులు గడుస్తున్నా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గం. దీంతో కాంగ్రెస్ బీజేపీకి బీ టీమ్‌గా పని చేస్తోందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. బాధిత బాలిక కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించి, న్యాయం జరిగేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బండి సంజయ్ ను బర్తరప్ చేయాలన్నారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. మహిళ భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు.
బేటీ బచావో – బేటీ పడావో, నారీ శక్తి సమ్మాన్ అంటూ ప్రచారం చేసే బీజేపీ నాయకులు ఇలాంటి ఘటనలపై తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే కేంద్ర సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.