కట్టంగూర్, మే 12 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైనా అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కట్టంగూర్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు మాట్లాడుతూ పోక్సో కేసు నమోదైనా నిందితుడిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.
కాం గ్రెస్ పాలనలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందన్నా రు. భగీరథ్‌పై నామామాత్రంగా పోక్సో కేసు నమోదు చేసి చేతులు దులుపుకోకుండా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి ప్రభు త్వం న్యాయం చేసి సంజయ్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అయిటిపాముల సర్పంచ్ బెల్లి సుధాకర్, పోగుల నర్సింహ, వడ్డె సైదిరెడ్డి, పెద్ది బాలనర్సయ్య, పనస సైదులు, అంతటి శ్రీను, రాచకొండ యాదయ్య, గోగు సైదులు, తిరుమలేశ్, నల్మాద సైదులు, సోముల వెంకటేశ్వర్లు, ఊ ట్కూరి సైదులు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.