సిటీబ్యూరో, మే 12(నమస్తే తెలంగాణ) : బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న పరిసరాల్లో చెట్లను నరుకుతున్నారు. దీంతో పర్యావరణ వేత్తలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పచ్చదనం, ప్రకృతి సమతుల్యతపై జరుగుతున్న ఈ చర్యలపై వాకర్లు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరిట విధ్వసం సృష్టిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.