అమరావతి : ఏపీ అసెంబ్లీ ( AP Assembly) సమావేశాలు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ( MLA Balakrishna) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని ( YS Jagan) సైకో గాడంటూ అసెంబీల్లో సంభోదించడం అక్కడివారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అసలేమైందంటే ?
గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ సినీ పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలతో మాట్లాడి అభివృద్ధికి చర్యలు తీసుకున్నారని , సీఎంను ఎవరెవరు కలువాలో జాబితాను తయారు చేశారని అక్కడ జరిగిన పరిణామాలను వివరించారు. జగన్ నివాసం వద్ద సినీ ప్రముఖుల కారును భద్రత సిబ్బంది ఆపివేశారని తెలిపారు.
అనంతరం సీఎం బదులు నాటి సినిమాటోగ్రఫి మంత్రి చర్చలు జరుపుతారని సమాచారం వచ్చిందని అన్నారు. దీంతో చిరంజీవి గట్టిగా అభ్యంతరం తెలుపడంతో జగన్‌తో సమావేశం జరిగిందని వెల్లడించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ స్పందించారు. నాడు సైకో జగన్ వద్ద జరిగిన సమావేశంలో గట్టిగా ఎవ్వడూ మాట్లాడలేదని తెలిపారు. తయారు చేసిన జాబితాలో తన పేరును 9వ పేరుగా ఎవరు వేశారో సమాధానం ఇవ్వాలని ప్రస్తుత సినిమాటోగ్రఫి మంత్రి దుర్గేష్‌ను కోరారు.