Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజు నష్టపోయాయి. మెటల్ సూచీలు మినహా మిగతా రంగాల్లో అమ్మకాలతో మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. ట్రంప్ హెచ్1బీ పాలసీ నేపథ్యంలో మరోసారి ఐటీ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,574.31 పాయింట్ల నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 81,092.89 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్.. 81,840.73 పాయింట్ల గరిష్టానికి చేరుకుంది. చివరగా 555.95 పాయింట్లు పతనమై.. 81,159.68 వద్ద స్థిరపడింది. 166.05 పాయింట్లు తగ్గి.. 24,890.85 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు దాదాపు 1,405 షేర్లు లాభపడగా.. 2,586 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో టాటా మోటార్స్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, టీసీఎస్, పవర్ గ్రిడ్ నష్టాలను చవిచూశాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, హీరో మోటోకార్ప్ లాభపడ్డాయి.
రంగాల వారీగా చూస్తే మెటల్ 0.22 శాతం లాభపడగా.. మిగతా అన్ని సూచీలు కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, పవర్, రియాల్టీ ఒక్కొక్కటి ఒకశాతం వరకు పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.7శాతం తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యూఎస్ సర్కారు ఇటీవల హెచ్1బీ వీసాపై చేసిన ప్రకటన ఐటీ కంపెనీల షేర్లు నష్టాలను పెంచింది. ఇప్పటివరకు వరుసగా ఐదు సెషన్లలో నష్టాలను నమోదు చేయడంలో ఈ ఇండెక్స్ ఇప్పుడు 6శాతానికిపైగా పడిపోయింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేర్లు ఇండెక్స్‌లో అత్యధికంగా నష్టపోయాయి. 2.5 శాతానికి పైగా పడిపోయి 52 వారాల కనిష్ట స్థాయి రూ.2,956.90కి చేరుకున్నాయి. పెర్సిస్టెంట్ సిస్టమ్స్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు దాదాపు 2శాతం తగ్గాయి. విప్రో, కోఫోర్జ్ షేర్లు ఒక్కొక్కటి ఒకశాతం తగ్గుముఖం పట్టాయి.