కారేపల్లి, జనవరి 10 : ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సింగరేణి మండల పరిధిలోని పాటిమీద గుంపు, బాజుమల్లాయిగూడెంలో గల అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం గర్భిణీలకు సీమంతాలు చేశారు. అలాగే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను నిర్వహించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన స్థానిక సర్పంచులు గుగులోతు సుజాత, కోరం కోటమ్మ, ఉప సర్పంచులు తాటి మంజుల, పోతురాజు ఉపేంద్రను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా మాతా, శిశువులకు అందజేస్తున్న సేవల గురించి ఐసిడిఎస్ సూపర్వైజర్లు ఎం.రమణ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ముక్తి నాగమణి, భూక్య ఉషారాణి, అంగన్వాడీ టీచర్లు ఎం.అమృతమ్మ, జి.రేణుక, బి.రజిత, పి.రాధా బాయ్, ఆశా వర్కర్లు బి.పద్మ, బి.సుశీల, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Karepally : అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు సీమంతం